Hanuman Badabanala Stotram, Hanuman Badabanala Stotram telugu, Hanuman Badabanala Stotram in Telugu, Hanuman Badabanala Stotram telugu pdf
రావణాసురిడి సోదరుడు విభీషణ విరచితం ఈ హనుమత్ బడబానల స్తోత్రం. హనుమంతుని శక్తి స్తుతిస్తూ మొదలయ్యి, అన్ని రుగ్మతల నుండి, అనారోగాల నుండి శత్రువుల నుండి కాపాడమని వేడుకుంటూ భయాల నుండి ఇబ్బందుల నుండి, సర్వారిష్టాల నుండి విముక్త లని చేయమని కోరుతూ చివరగా స్వామి వారి ఆశీస్సులు, ఆరోగ్యం అన్నిట సఫలీక్రుతులం అయ్యేటట్టు దీవించమని సాగుతుంది.
ఇది చాలా శక్తివంతమైన స్తోత్రము. గురువుల, గురుతుల్యులైన పెద్దలు అనుమతితో నలభై ఒక్క రోజులు లేదా వారి ఉపదేశం ప్రకారం భక్తీ శ్రద్దలతో పారాయణం చేస్తే అన్ని రకాల సమస్యలు ముఖ్యం గా ఆరోగ్యపరమైన వాటినుండి తప్పక ఉపసమనం లభిస్తుందని పెద్దల ఉవాచ.
హనుమత్ బడబానల స్తోత్రం ఈ స్తోత్రము నిత్యమూ పఠించదగినది. దీనివలన శత్రువులు సులభముగా జయింప బడుదురు. సకల విధములైన జ్వరములు భూతప్రేతాదికములు, శత్రువులు చేసిన ప్రయోగములు తొలగిపోవును. అసాధ్యములను సాధింపగలదీ స్తోత్రము.
శ్రీ హనుమాన్ బడబానల స్తోత్రం (Sri Hanuman Badabanala Stotram)
ఓం అస్య శ్రీ హనుమద్బడబానల స్తోత్ర మంత్రస్య శ్రీ రామచంద్ర ఋషిః శ్రీ బడబానల హనుమాన్ దేవతా మమ సమస్త రోగ ప్రశమనార్ధం ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృధ్యర్ధం సమస్త పాపక్షయార్ధం శ్రీ సీతా రామచంద్ర ప్రీత్యర్ధం హనుమద్భడబానల స్తోత్ర జప మహం కరిష్యే ||
ఓం హ్రాం హ్రీం ఓం నమోభగవతే శ్రీ మహా హనుమతే ప్రకట పరాక్రమ సకల దిక్మండల యశోవితాన ధవళీ కృత, జగత్రిత్రయ వజ్రదేహ, రుద్రావతార, లంకాపురి దహన, ఉమాఅనలమంత్ర, ఉదధి బంధన, దశశిరః కృతాంతక, సీతాశ్వాసన, వాయుపుత్ర, అంజనీ గర్బసంభూత, శ్రీ రామ లక్ష్మణానందకర, కపిసైన్య ప్రాకార, సుగ్రీవసాహా య్యకరణ, పర్వతోత్పాటన, కుమార బ్రహ్మ చారిన్, గంభీరనాథ సర్వపాప గ్రహవారణ, సర్వ జ్వరోచ్చాటన డాకినీ విద్వంసన ||
ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే మహా వీరాయ, సర్వ దుఃఖనివారణాయ, గ్రహమండల, భూత మండల, సర్వ పిశాచ మండలోచ్చాటన భూత జ్వరై, కాహిక జ్వర, ద్వాహిక జ్వర, త్రాహిక జ్వర, చాతుర్ధిక జ్వర, సంతాప జ్వర, విషమ జ్వర, తాప జ్వర, మహేశ్వర వైష్ణవ జ్వరాన్ చింది చింది, యక్ష రాక్షస భూత ప్రేత పిశాచాన్ ఉచ్చాటయ ఉచ్చాటయ, ఓం హ్రాం హ్రీం నమో భగవతే శ్రీ మహా హనుమతే ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః ఆం హాం హాం హాం హాం ఔం సౌం ఏహి ఏహి, ఓం హం, ఓం హం, ఓం హం, ఓం నమో భగవతే శ్రీ మహా హనుమతే, శ్రవణ చక్షుర్భూతానం, శాకినీ డాకినీ విషమ దుష్టానాం, సర్వ విషం హర హర, ఆకాశం భువనం, భేదయ భేదయ, ఛేదయ ఛేదయ, మారయ మారయ, శోషయ శోషయ, మోహయ మోహయ, జ్వాలాయ జ్వాలాయ, ప్రహారయ ప్రహారయ, సకల మాయాం, భేదయ భేదయ, ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే శ్రీ మహా హనుమతే సర్వగ్రహో చ్చాటన పరబలం, క్షోభయ క్షోభయ, సకల బంధన మోక్షణం కురు, శిరఃశూల, గుల్ప్హశూల, సర్వశూల నిర్మూలయ నిర్మూలయ, నాగపాశానంత వాసుకి తక్షక కర్కోటక కాళియాన్ యక్షకుల, జలగత బిలగత, రాత్రిమ్చర దివాచర సర్వాన్నిర్విషం కురు కురు స్వాహా, రాజభయ చోరభయ పరయంత్ర పరమంత్ర పరతంత్ర పరవిధ్యాచ్చేదయ చేదయ, స్వమంత్ర స్వయంత్ర స్వవిద్యాః, ప్రకటయ ప్రకటయ సర్వారిష్టాన్నాశయ నాశయ, సర్వశత్రూన్నాశయ నాశయ, అసాధ్యం సాదయ సాదయ హుం ఫట్ స్వాహా ||
ఇతి విభీషణ కృత హనుమాన్ బడబానల స్తోత్రం సంపూర్ణం