wedding anniversary wishes in telugu Pelli roju shubahkankshalu telugu ఇక మన భారతదేశంలో అయితే ఇప్పటికీ 90 శాతం మంది ప్రజలు వివాహ వ్యవస్థని బలంగా విశ్వసిస్తున్నారు. అలాగే వారు విశ్వసించడమే కాకుండా దానిని పాటిస్తున్నారు కూడా. కాకపోతే ఈ మధ్యకాలంలో విడాకుల శాతం పెరుగుతున్న వేళ దాదాపు 10 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళు & 50 ఏళ్ళు వివాహ బంధంలో ఉన్న వారు వారికి వివాహ బంధాన్ని కొనసాగించేందుకు స్ఫూర్తివంతంగా నిలుస్తున్నారు. ఈ తరుణంలో మన కుటుంబంలో వివాహ బంధం ద్వారా ఒకటైన వారికి వారి వివాహ వార్షికోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేసేందుకు ఇక్కడ కొన్ని సందేశాలు ఇస్తున్నాం. ప్రస్తుత తరుణంలో ప్రతి చిన్న అకేషన్ ను సెలబ్రేట్ చేసుకుంటూ సంతోషంగా గడిపేందుకు అంతా ప్రాధాన్యం ఇస్తున్నారు. అందుకే మనకు తెలిసినవారు, స్నేహితులు లేదా బంధువుల పెళ్లి రోజు వచ్చినప్పుడు వారికి మీరు పంపదగిన విధంగా కొన్ని సందేశాలు, శుభాకాంక్షలు చూద్దాం. వివాహ వార్షికోత్సవం శుభాకాంక్షలు తెలుగులో నా జీవితంలో సంతోషాన్ని నింపిన నీకు మన పెళ్లిరోజు శుభాకాంక్షలు.. గమ్యం తెలియక సాగుతున్న నా జీవితాన్ని గాడిన పెట్టిన దేవతవి...
This blog is about devotional stotra nidhi for devotees