wedding anniversary wishes in telugu Pelli roju shubahkankshalutelugu ఇక మన భారతదేశంలో అయితే ఇప్పటికీ 90 శాతం మంది ప్రజలు వివాహ వ్యవస్థని బలంగా విశ్వసిస్తున్నారు. అలాగే వారు విశ్వసించడమే కాకుండా దానిని పాటిస్తున్నారు కూడా. కాకపోతే ఈ మధ్యకాలంలో విడాకుల శాతం పెరుగుతున్న వేళ దాదాపు 10 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళు & 50 ఏళ్ళు వివాహ బంధంలో ఉన్న వారు వారికి వివాహ బంధాన్ని కొనసాగించేందుకు స్ఫూర్తివంతంగా నిలుస్తున్నారు.
ఈ తరుణంలో మన కుటుంబంలో వివాహ బంధం ద్వారా ఒకటైన వారికి వారి వివాహ వార్షికోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేసేందుకు ఇక్కడ కొన్ని సందేశాలు ఇస్తున్నాం. ప్రస్తుత తరుణంలో ప్రతి చిన్న అకేషన్ ను సెలబ్రేట్ చేసుకుంటూ సంతోషంగా గడిపేందుకు అంతా ప్రాధాన్యం ఇస్తున్నారు. అందుకే మనకు తెలిసినవారు, స్నేహితులు లేదా బంధువుల పెళ్లి రోజు వచ్చినప్పుడు వారికి మీరు పంపదగిన విధంగా కొన్ని సందేశాలు, శుభాకాంక్షలు చూద్దాం.
వివాహ వార్షికోత్సవం శుభాకాంక్షలు తెలుగులో
- నా జీవితంలో సంతోషాన్ని నింపిన నీకు మన పెళ్లిరోజు శుభాకాంక్షలు..
- గమ్యం తెలియక సాగుతున్న నా జీవితాన్ని గాడిన పెట్టిన దేవతవి నీవే! అంతటి గొప్ప వ్యక్తి అయిన నీకు మన వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
- నిన్ను పెళ్లి చేసుకున్న తరువాత నాలో చాలా మంచి మార్పులు వచ్చాయి. అటువంటి మార్పులకి అంకురార్పణ జరిగింది మన పెళ్లి రోజే.. అందుకే ఆ రోజుని పురస్కరించుకుని నీకు మన పెళ్లిరోజు శుభాకాంక్షలు.
- స్నేహితురాలు జీవిత భాగస్వామిగా మన జీవితంలో వస్తే ఆ ఆనందమే వేరు. అంతటి ఆనందాన్నిచ్చిన నీకు మన పెళ్లి రోజు శుభాకాంక్షలు.
- మన పెళ్లి ద్వారా నాకు లభించిన ఒక మంచి స్నేహితురాలివి నీవు. అంతటి స్నేహాన్ని నాకు పంచుతున్న నీకు మన వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
- నిన్ను చూసిన మొదటి రోజే అర్ధమైంది కచ్చితంగా నువ్వే నా భార్యవి అని... అంత బాగా ఆకట్టుకున్నావు నన్ను. మన పెళ్లి రోజు శుభాకాంక్షలు.
- నా జీవితంలో అతిముఖ్యమైన రోజుగా ఎప్పటికి మన పెళ్లి రోజుని భావిస్తాను. ఎందుకంటే ఆ రోజు నీ సహచర్యం నాకు దొరికింది కాబట్టి...
- ప్రేమ నాకు ప్రోత్సాహాన్నిస్తే... నీతో పెళ్లి నాకు ధైర్యాన్నిచ్చింది. అంతటి ధైర్యాన్ని ఇచ్చిన నీకు మన పెళ్లి రోజు శుభాకాంక్షలు.
- పెళ్లి మండపంలో నిన్ను చూసాక కానీ నేను ఎంత అదృష్టవంతుడినో నాకు అర్ధం కాలేదు. అంతటి అదృష్టాన్ని ఇచ్చిన నీకు మన పెళ్లి రోజు శుభాకాంక్షలు.
- నేను నీతో పెళ్ళికి ఒప్పుకోవడం... జీవితంలో తీసుకున్న ఒక మంచి నిర్ణయం. అంత మంచి నిర్ణయానికి ఆనందిస్తూ నీకు మన పెళ్లి రోజు శుభాకంక్షాలు.
- నా జీవితంలో మా నాన్న తరువాత నేను చూసిన ఏకైక జెంటిల్మెన్ వి నువ్వే మై డియర్ హస్బెండ్. నీకు మన పెళ్లి రోజు శుభాకాంక్షలు.
- జీవిత భాగస్వామిలో ఒక మంచి స్నేహితుడు ఉంటే అంతకన్నా అదృష్టం ఇంకేముంటుంది. అంతటి అదృష్టం నాకిచ్చిన మీకు మన పెళ్లి రోజు శుభాకాంక్షలు.
- మన పెళ్ళికి ముందు నా ఇష్టాయిష్టాలు తెలుసుకుని.. ఇప్పటికి కూడా వాటికి తగట్టుగా నడుచుకునే మీలాంటి వారు నాకు లభించడం నిజంగా నా అదృష్టమే. ఈ సందర్భంగా మీకు మన పెళ్లి రోజు శుభాకాంక్షలు.
- మన మొదటి పెళ్లి రోజు నాడు నాకిష్టమైన ప్రదేశానికి మీరు నన్ను తీసుకెళ్ళడం నేనెప్పటికీ మర్చిపోలేను. అంతటి మధురజ్ఞాపకాన్ని ఈ పెళ్లి రోజు కూడా గుర్తు చేసుకుంటూ మీకు మన పెళ్లి రోజు శుభాకాంక్షలు.
- జీవిత భాగస్వామి గురించి వెతుకుతున్న నాకు మీరు లభించడంతో హాయిగా ఉండగలుగుతున్నాను. నాకు ఇంతటి సంతోషానిస్తున్న మీకు మన పెళ్లి రోజు శుభాకాంక్షలు.
- జీవితంలో పెళ్లి తరువాత కూడా కెరీర్ ని కొనసాగించేందుకు తోడ్పాటునందించిన నీకు నేను ఎప్పటికి కృతజ్ఞురాలినే. అలాంటి మీకు మన వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
- జీవితంలో నేను మిమ్మల్ని భర్తగా పొందాక గాని అర్ధంకాలేదు నేను ఎంత లక్కీ అని.. నా లక్ కి కారణమైన మీకు మన పెళ్లి రోజు శుభాకాంక్షలు.
- మన పెళ్లి రోజు మీరు ఇచ్చిన కానుక నేను ఎన్నటికీ మరువను. దానికి కారణం ఆ బహుమతి మీరే కావడం.
- మన మొదటి వివాహ వార్షికోత్సవం రోజున మీతో కలిసి చేసిన ప్రయాణం నేను ఎన్నటికి మరువలేను. అలాంటి రోజులు మరెన్నో రావాలని కోరుకుంటూ మీకు మన పెళ్లి రోజు శుభాకాంక్షలు.
- ఈ రోజు కోసం నేను ఎంతగానో ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే ఇది మన పెళ్లి రోజు కాబట్టి..